Ashok Gajapathi Raju: సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గోవాలోని గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనను ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేశ్, కొండపల్లి శ్రీనివాస్, గోవా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, డీజీపీ, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
ఇప్పటికే అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు గోవాకు చేరుకున్నారు. ఆయన భార్య సునీలా గజపతిరాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మరో కుమార్తె విద్యావతిదేవి శుక్రవారం రాత్రే గోవాకు చేరుకున్నారు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు, బంధువులు కూడా గోవాకు వెళ్లి ఆయనకు మద్దతుగా ఉండనున్నారు.
గోవా విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అశోక్ గజపతిరాజును ఘనంగా స్వాగతించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా అక్కడ ఉత్సాహం నెలకొంది.