CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం: అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియామకంపై సీఎం చంద్రబాబు హర్షం

CM Chandrababu: తెలుగు ప్రజలకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నాయకుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఆయన అన్నారు.

అశోక్‌ గజపతిరాజును గవర్నర్‌గా నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అశోక్‌ గజపతిరాజు తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని, గోవా గవర్నర్‌గా ఆ పదవికి మరింత వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు.

Also Read: Delhi: అశోక్ గజపతిరాజుకు గౌరవ పదవి.. గోవా గవర్నర్‌గా నియామకం

మంత్రి నారా లోకేశ్‌ కూడా అశోక్‌ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. నిజాయతీ, నిబద్ధతతో ఆయన గవర్నర్‌ పదవికి గౌరవం తెస్తారని లోకేశ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ గౌరవాన్ని అశోక్‌ గజపతిరాజుకు అందించిన రాష్ట్రపతి, ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కూడా అశోక్‌ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కేంద్రమంత్రిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అశోక్‌ గజపతిరాజు గోవాకు సమర్థవంతమైన సేవలు అందిస్తారని రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Lobo: రోడ్డు ప్రమాదం కేసు: టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *