Arvind Kejriwal

Arvind Kejriwal: కేంద్రం భూములిస్తే.. పారిశుధ్య కార్మికులకు ఇళ్లు కట్టిస్తాం

Arvind Kejriwal: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఉదయం పారిశుధ్య కార్మికుల కోసం ఒక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై భూమి ఇస్తే అందులో ఇళ్లు నిర్మించి పారిశుద్ధ్య కార్మికులకు సులభ వాయిదాల్లో యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. ఢిల్లీలోని భూముల వ్యవహారం కేంద్రం ఆధీనంలో ఉందని, అందుకే ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు అని తెలిపారు.

దీనికి ప్రధాని అంగీకరిస్తారని ఆశిస్తున్నామని, ఎందుకంటే ఇది పేదల సంక్షేమానికి సంబంధించినదని, ఢిల్లీలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రధాని చెప్పినట్లు కేజ్రీవాల్ అన్నారు.

గత 2 నెలల్లో కేజ్రీవాల్ 8 ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీలో నివసిస్తున్న కౌలుదారులకు ఉచిత విద్యుత్‌, నీరు అందిస్తామని గతంలో జనవరి 18న ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *