Arvind Kejriwal: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. ఆయన భగవత్‌కు 4 ప్రశ్నలు అడిగారు. బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. పూర్వాంచలి, దళితుల పేర్లను కూడా తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందా? అనేది రెండో ప్రశ్న. అలాగే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ భావించడం లేదా? అనేది మూడో ప్రశ్న.
దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ సచ్‌దేవా స్పందిస్తూ – సర్సంచ్ చాలక్‌తో మాట్లాడే స్థాయి కూడా మీకు లేదు. కెనడాలో టెర్రరిస్టుల నుంచి డబ్బులు తీసుకున్న మీరు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ని ఏ రకంగా ప్రశ్నించగలుగుతున్నారు? అంటూ కేజ్రీవాల్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మీరు మహిళా సమ్మాన్ యోజన పేరుతో పంజాబ్, ఢిల్లీ తల్లులు మరియు సోదరీమణులను ఒక్క పైసా కూడా చెల్లించకుండా మోసం చేసారు అంటూ సచ్‌దేవా దుయ్యబట్టారు. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారా? మీ పని మోసం చేయడం, సమస్యల నుండి దృష్టిని మళ్లించడం అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కేజ్రీవాల్ లేఖపై సచ్‌దేవా స్పందిస్తూ కేజ్రీవాల్‌కు లేఖ కూడా రాశారు. ఇందులో కొత్త సంవత్సరానికి 5 తీర్మానాలు తీసుకోవాలని కేజ్రీవాల్‌ను కోరారు.
ఇది కూడా చదవండి: Predictions For 2025: ఈ ఏడాది అంతా బీభత్సమే! నమ్మాల్సిందే.. కరోనా వస్తుందని ముందే చెప్పిన వ్యక్తి చెబుతున్నాడు కాబట్టి!
Arvind Kejriwal: షాహదారా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్ల పేర్ల తొలగింపు కోసం బీజేపీ నేత విశాల్ భరద్వాజ్ ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసినట్లు ఆప్ నేత ప్రియాంక కక్కర్ సోమవారం తెలిపారు. ఢిల్లీలో నివసిస్తున్న చాలా మంది పూర్వాంచలీల ఓట్లను బీజేపీ కట్ చేయాలనుకుంటోందని ఆయన అన్నారు.
ఈ ఏడాది బీజేపీ ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తుందని భావిస్తున్నామని ప్రియాంక కక్కర్ అన్నారు. కేజ్రీవాల్ సంక్షేమ పథకాలైన ఉచిత విద్యుత్, ఉచిత నీరు వంటి వాటిని తమ (బీజేపీ పాలిత) 20 రాష్ట్రాల్లో కూడా అవలంబిస్తారు. మహిళలకు నెలకు రూ. 2100 వంటి మా కొత్త హామీలు వృద్ధులకు ఉచిత చికిత్సకు ఆటంకం కలిగించవు. ప్రతి ప్రజా సంక్షేమ పథకానికి అండగా ఉంటాం.
ప్రవేశ్ వర్మ అధికారిక నివాసమైన 20 విండ్సర్ ప్లేస్‌లో మహిళలకు ₹ 1100 పంపిణీ చేస్తున్నట్లు అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రవేశ్ వర్మను అరెస్ట్ చేయాలి. ఈడీ-సీబీఐ, ఢిల్లీ పోలీసులు ఆయన నివాసంపై దాడులు చేయాలి. ఈ విషయంలో ఎన్నికల సంఘం కూడా సమాధానం చెప్పాలి అంటూ ఆమె డిమాండ్ చేశారు.

