Kodangal: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం హకీంపేటలో ఫార్మా కంపెనీ భూ బాధిత రైతులు తరపున BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం నుంచి దుద్యాల మండల తహసీల్దార్ కార్యాలయం వరకు మహా పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. పాదయత్రకి హైదారాబాద్ నుంచి వస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, MLC నవీన్ రెడ్డి లను బొమ్మరస్ పేట మండలం తున్కిమెట్ల దగర అరెస్టు చేసి తరలించడం జరిగింది..అరెస్టు చేసిన విషయం తెలిసిన BRS నాయకులు కార్యకర్తలు,రైతులు పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం నుంచి పాదయాత్ర గా వస్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో హకీం పేట చౌరస్తాలో ధర్నా,రాస్తారోకో నిర్వహించారు.. అనంతరం తాసిల్దార్ కు భూ బాధితులతో కలిసి బి ఆర్ ఎస్ నాయకులు మెమోరండం అందజేశారు..దీంతో రైతులు ధర్నాను విరమించారు.

