Celebrity Cricket Mela: డల్లాస్ నగరంలో అతి పెద్ద క్రీడా-సాంస్కృతిక మేళాకి రంగం సిద్ధం అవుతోంది. టైటిల్ స్పాన్సర్ దేశీమండి తన గౌరవ భాగస్వాములతో కలిసి టాలీవుడ్ క్రికెట్ అసోసియషన్ (TCA) సహకారంతో అతిపెద్ద సెలబ్రిటీ క్రికెట్ మేళా – దేశీ మండి కప్ 2025 ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. టాలీవుడ్ కి చెందిన అగ్రశ్రేణి ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గోవడానికి రానున్నారని వెల్లడించింది.
దేశీ మండి కప్ 2025 ఏర్పాట్లు.. ఈవెంట్ కి సంబంధించిన విశేషాలను టాలీవుడ్ నటుడు, TCA కెప్టెన్ హీరో తరుణ్ ఏప్రిల్ 2న జరిగిన ఒక మీడియా కార్యక్రమంలో వివరించారు.
కేవలం వినోదం కోసం ఈ సెలబ్రిటీ క్రికెట్ మేళాను ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. దీని ద్వారా ప్రీ మెచ్యూర్ బేబీ కేర్ అలాగే నవజాత శిశువుల విద్య కు సపోర్ట్ చేయడం కోసం ఈ క్రికెట్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే దీని నుంచి వచ్చే ఆదాయం నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి నవజాత శిశువుల సంరక్షణలో ప్రాణాంతక సమస్యలు తగ్గించడానికి అవసరమైన వనరులు, టూల్స్ లో శిక్షణ ఇవ్వడానికి సపోర్ట్ గా నిలుస్తుందని చెప్పారు.
జూన్ 27, 28 తేదీల్లో యాక్షన్-ప్యాక్ వీకెండ్ గా ఈ సెలబ్రిటీ క్రికెట్ మేళా నిర్వహిస్తారు. జూన్ 27న వినెస్సా ఈవెంట్స్ ద్వారా ప్రత్యేకంగా గ్రాండ్ బాంకెట్ నైట్ నిర్వహిస్తారు. ఈ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్స్.. ప్రముఖ సెలబ్రిటీల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. అత్యంత అద్భుతమైన వినోదాన్ని అందించే కార్యక్రమాల మాలిక ఈరోజు నిర్వహించడం జరుగుతుంది.
ఇక జూన్ 28న సెలబ్రిటీ క్రికెట్ మేళా ఉంటుంది. యుటి డల్లాస్ క్రికెట్ స్టేడియంలో పగటిపూట క్రికెట్ కార్నివాల్ నడుస్తుంది. దీనిలో సెలబ్రిటీ మ్యాచ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా సకుటుంబ సపరివారంగా సరదాగా నిర్వహించే వేడుకలు ఉంటాయి.
Also Read: LSG vs MI: సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ తో బరిలోకి దిగనున్న లక్నో సూపర్ జెయింట్స్
ఈ ప్రోగ్రామ్ హైలైట్స్ ఈవిధంగా ఉంటాయి..
* ఎలైట్ లైవ్ ప్రొడక్షన్స్ ద్వారా విందు ,మ్యాచ్ డే రెండింటి ప్రత్యక్ష ప్రసారం
* 40+ స్టాల్స్ ఏర్పాటు
* బౌన్సీ హౌస్‌లు, ఫేస్ పెయింటింగ్, ఫన్ జోన్‌లతో సహా పిల్లలకు అనుకూలమైన కార్యకలాపాలు
* రాగ అండ్ డ్యాన్స్ అకాడమీ ద్వారా 300 మంది నృత్యకారులతో గ్రాండ్ కుంభమేళా-శైలి హాఫ్‌టైమ్ ప్రదర్శన
* జాతీయ – అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థల నుండి భాగస్వామ్యం
* మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ప్రముఖులు – టాలీవుడ్ తారల ప్రదర్శనలు
* అధికారిక హాస్పిటాలిటీ భాగస్వామిగా వర్టికల్ సింక్
* డెకరేటివ్ స్పాన్సర్‌లుగా పెటల్స్- స్పార్కిల్స్
ఇక ఈ ప్రెస్ మీట్ లో వినెస్సా ఈవెంట్స్ CEO హరి మాట్లాడుతూ ఇమ్మెచ్యూర్ బేబీ సంరక్షణకు మద్దతు ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న దాతృత్వ దృష్టిని హైలైట్ చేశారు. సేవ చేయాలనే హృదయం ఉన్న వ్యవస్థాపకుడిగా, విందు గొప్పతనం – ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
మెగా-ఈవెంట్ అమలులో అపార అనుభవం ఉన్న ప్రముఖ వ్యవస్థాపకుడు – డల్లాస్‌లో ప్రసిద్ధ వ్యక్తి రాజేష్ కాలేపల్లి, ఈ కార్యక్రమం భారతీయ-అమెరికన్ సమాజానికి తీసుకువచ్చే స్కేల్, సమన్వయం – సాంస్కృతిక ప్రభావం గురించి వివరించారు.
గుడ్ వైబ్స్ ఈవెంట్స్ నుండి, స్రవంతి – TCA తో వారి సహకారం గురించి – ఈ భాగస్వామ్యం ఈ ఈవెంట్‌ను నిజం చేయడంలో ఎలా కీలకంగా ఉంది అనే విషయాన్ని వెల్లడించారు.
V2 మ్యూజిక్ అండ్ మూవీస్ వంశీ వుప్పలాడాడియం ఈవెంట్ సాంస్కృతిక పరిధి, వినోద వల్లరుల ఏర్పాట్లను చెబుతూనే సంగీతం, సినిమాలు – క్రికెట్ ఒక శక్తివంతమైన ప్రయోజనం కోసం ఎలా కలుస్తాయో హైలైట్ చేశారు.
సెలిబ్రిటీ క్రికెట్ కార్నివాల్ (ఆస్ట్రేలియా) నుండి సాయి కృష్ణ, CEO తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ పెద్ద మేళాలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఒక ముఖ్యమైన సామాజిక సహకార లక్ష్యం కోసం చేయూత ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. క్రికెట్ కోసం రండి, లక్ష్యం కోసం ఉండండి—దేశీ మండి కప్ 2025లో భాగం అవ్వండి! అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలకు, మీడియా విచారణలు, భాగస్వామ్యాలు లేదా పత్రికా సామగ్రి కోసం ccmela2025@gmail.com సంప్రదించాలని తెలిపారు.