NKR 21

NKR 21: అర్జున్ S/O వైజయంతి విడుదల తేదీ ఫిక్స్!

NKR 21: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమా అర్జున్ S/O వైజయంతి. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ దాదాపుగా లాక్ అయినట్టు తెలుస్తోంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఏప్రిల్ 17 లేదా 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, విజయశాంతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *