Summer Tips

Summer Tips: వేసవిలో స్టైలిష్​ బూట్లు ధరిస్తున్నారా..? ఇవి తప్పక తెలుసుకోవాలి..

Summer Tips: రంగురంగుల, ఆకర్షణీయమైన బూట్లు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ బూట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది తమ దుస్తులకు సరిపోయేలా బూట్లు ధరిస్తారు. కానీ వేసవిలో కొంతమంది రోజంతా బూట్లు ధరించి తిరుగుతూ ఉండటం మీరు చూసి ఉండవచ్చు. ఈ సీజన్‌లో బూట్లు ధరించడం ఎంతవరకు కరెక్ట్? దీని వల్ల ఏమైన సమస్యలు వస్తాయా..?

వేసవిలో బూట్లు వేసుకునే వారికి చిట్కాలు :

వేసవిలో మీ పాదాలకు గాలి తగిలేలా చూసుకోవాలి. చాలా మంది రోజంతా బూట్లు ధరిస్తారు. ఎండ, వేడి కారణంగా పాదాలు విపరీతంగా చెమట పడుతాయి. బూట్లు బిగుతుగా ఉండటం వల్ల పాదాల దుర్వాసన వస్తుంది. ఈ సీజన్‌లో వీలైనంత వరకు తోలు బూట్లు ధరించడం మానుకోవాలి.

వేసవిలో చాలా బిగుతుగా లేని బూట్లు లేదా పాదరక్షలను కొనాలి. చాలా బిగుతుగా ఉండే బూట్లు ధరించడం వల్ల రక్త ప్రసరణ సమస్యలు, వాపు, పాదాలలో నొప్పి వస్తుంది.

గాలి ప్రసరణ లేకుండా రోజంతా పాదాలను బూట్లలో ఉంచడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందువల్ల, తేలికైన, గాలి వెళ్ళే పాదరక్షలను ధరించడం ఉత్తమం.

Also Read: Akshaya Tritiya 2025: ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది.. శుభ సమయం, విశిష్టతలేంటో తెలుసుకోండి…

మీరు బూట్లు ధరిస్తే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బూట్లు, సాక్స్‌లను సరిగ్గా శుభ్రం చేయకపోతే అది మీ పాదాలకు చర్మ వ్యాధులకు దారితీస్తుంది.

వేసవిలో బరువైన బూట్లు ధరించవద్దు. దీనివల్ల పాదాలు ఎక్కువగా చెమట పడతాయి. ఎల్లప్పుడూ బూట్లతో పాటు గుడ్డ బూట్లు, కాటన్ సాక్స్ ధరించాలి. ఈ సమయంలో వీలైనంత వరకు నైలాన్ లేదా పాలిస్టర్‌తో చేసిన సాక్స్‌లను ధరించడం మానుకోవాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *