Bad Breath: ష్… దగ్గరగా వచ్చి నాతో మాట్లాడకు.. నీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది..? ఈ మాటను చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. అదేంటి నేను బ్రష్ చేసుకున్నా, మౌత్ వాష్ వాడుతున్నా.. అయినా నా నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రావడం ఏంటనేది చాలా మందికి డౌట్. అయితే నోటి నుంచి దుర్వాసన ఎందుకొస్తుంది..? దానికి పరిష్కారాలేంటి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
దుర్వాసన రావడానికి ప్రధాన కారణాలు:
అధికంగా మద్యం సేవించడం వల్ల దుర్వాసన వస్తుంది. కొంతమందికి ఎటువంటి పరిమితులు లేకుండా మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఈ వ్యక్తులకు దుర్వాసన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి.
ధూమపానం చేసేవారు, పొగాకును అతిగా ఉపయోగించే వారు కూడా దుర్వాసనతో బాధపడే అవకాశం ఉంది.
డీహైడ్రేషన్ కూడా దుర్వాసనకు కారణమవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా ఇలాంటి సమస్య రావచ్చు.
వెల్లుల్లి, అల్లం, ఇతర మసాలా దినుసులు అధికంగా తీసుకోవడం వల్ల కూడా దుర్వాసన వస్తుంది.
దుర్వాసనను ఎలా నివారించాలి? :
అల్పాహారం లేదా భోజనాన్ని వీలైనంత చప్పగా తినాలి. కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ కూడా మంచిది కాదు.
ప్రతి భోజనం తర్వాత, కొన్ని పుదీనా ఆకులను నమిలి తినాలి. ఇది దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుంది.
మీ దంతాలను తోముకునేటప్పుడు బేకింగ్ సోడా వాడాలి. ఇది నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడానికి, దంతాలు, దవడలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
నోటి దుర్వాసనతో బాధపడేవారు వీలైనంత తరచుగా ఉప్పు నీటితో నోటిని పుక్కిలించుకోవాలి. ఇది మీ నోటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దుర్వాసనను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
తరచుగా చూయింగ్ గమ్ నమలడం, దుర్వాసనను తగ్గించడానికి మౌత్ వాష్‌లను ఉపయోగించడం మానుకోవాలి. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఎక్కువ.