Sugarcane Juice: వేసవి ప్రారంభమవ్వడంతో వేడి క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ సాధారణంగా దాహం కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో తరచుగా శీతల పానీయాలు తాగాలని అనిపించడం సహజం. చాలా మంది చెరకు రసం లేదా చెరకు పాలు తాగుతుంటారు. ఈ రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీనిని తరచుగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. ముఖ్యంగా వేసవిలో అధిక చెరకు రసం శరీరానికి ఆరోగ్యకరమైనది కాదు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరానికి మించి తాగకపోతే దాని ప్రయోజనాలను పొందవచ్చు.
ఎక్కువగా తీసుకుంటే అమృతం కూడా విషపూరితం అవుతుందనే సామెతను వినే ఉంటారు. అందువల్ల, ఏదైనా అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఇది చెరకు రసానికి కూడా వర్తిస్తుంది. కానీ మితంగా తీసుకుంటే.. అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చెరుకు రసంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో చెరకు రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతతో పాటు జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా చెరకు రసంలోని మినరల్స్ ఎముకలను బలపరుస్తాయి.
Also Read: Pomegranate Benefits: దానిమ్మ తింటే.. ఇన్ని లాభాలా ?
చెరకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు :
1. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
2. మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.
3. దంతాలు మరియు ఎముకలను బలపరుస్తుంది.
4. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
5. రక్తపోటును స్థిరీకరిస్తుంది.
6. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
7. స్ట్రోక్ అవకాశాన్ని తగ్గిస్తుంది.
8. వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.
9. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కానీ ప్రతిరోజూ చెరుకురసం తాగడం మంచిది కాదు. దీనివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి అవసరానికి మించి తాగొద్దు.