AR Rahman Birthday: సప్తస్వర సాధనలో సంగీతసాగరాన్ని ఈదుతూ నవరాగాలను పలికించిన ఘనుడు ఎ.ఆర్. రహమాన్… జనవరి 6తో 58 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు రహమాన్… ఈ సందర్భంగా రహమాన్ కు విషెస్ చెబుతూ ఆయన స్వరవిన్యాసాలను మననం చేసుకుందాం…
ఎ.ఆర్. రహమాన్ అంటే అల్లా రఖా రహమాన్… అభిమానులకు మాత్రం అలరించే రాగాల రహమాన్… స్వరమాంత్రికుడు, సంగీత తాంత్రికుడు… రహమాన్ గురించి ఎంత చెప్పుకున్నా కొంతే అవుతుంది… సంగీతంతోనే కాదు, రచన, నటన, నిర్మాణంతో తన బహుముఖ ప్రజ్ఞను లోకానికి చాటుతున్నారు రహమాన్…
ఎ.ఆర్.రహమాన్ అన్న పేరు వింటే చాలు సంగీతాభిమానుల మనసు సప్తస్వరవిన్యాసాలతో నిండిపోతుంది… తొలి చిత్రం రోజా మొదలు – మొన్నటి ‘పొన్నియిన్ సెల్వన్’ దాకా రహమాన్ బాణీల్లోని మహత్తు మత్తు చల్లి గమ్మత్తు చేస్తూనే ఉంది…
అంతర్జాతీయంగా ఎంత ఖ్యాతి గడిస్తేనేమి… రహమాన్ మది నిండా భారతీయత ఉట్టి పడుతూ ఉంటుంది… అందుకు నిదర్శనంగా ఎన్నెన్నో రహమాన్ స్వరవిన్యాసాలు మనకు మహదానందం పంచుతూనే ఉంటాయి…
తెలుగువారితోనూ రహమాన్ బంధం ఈ నాటిది కాదు… ఇక తెలుగు చిత్రాల్లో ఆయన బాణీలు పలకరించిన తీరు… తెలుగు అనువాదాల్లోనూ రహమాన్ రచ్చ చేసిన రీతిని ఎవరూ మరచిపోలేరు.