appudo ippudo eppudo

Appudo Ippudo Eppudo: తక్కువ నిడివితోనే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

Appudo Ippudo Eppudo: నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. ఎందుకో ఏమో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. సుధీర్ కె వర్మ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ‘కార్తికేయ2’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్ ఆ తర్వాత ’18 పేజెస్’, ‘స్పై’ సినిమాలతో ఎలాంటి ప్రభావం చూపించలేక పోయాడు. అందుకే ఈ సినిమాపై ఆ ప్రభావం పడింది. ‘స్వామిరారా’, ‘కేశవ’ సినిలా తర్వాత నిఖిల్, సుదీర్ వర్మ కలయికలో వస్తున్న మూవీ ఇది.
Appudo Ippudo Eppudo: నిజానికి ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లు ఎప్పుడు మొదలైంది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ అంతగా తెలియలేదు. అయితే ఇందులో రెండు ప్రేమకథలు, ట్విస్ట్ లు ఉంటాయంటున్నారు హీరోనిఖిల్. 8వ తేదీన రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యు/ఎతో రాబోతున్న ఈ చిత్రం నిడివి కేవలం 2గంటల 2 నిమిషాలట. ఓ విధంగా ప్రేక్షకులకు బాగా రిలీఫ్ ఇచ్చే అంశం. ఈ సినిమా ద్వారా రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దివ్యాంశ్ కౌశిక్ మరో హీరోయిన్. అజయ్, వైవా హర్ష, జాన్ విజయ్, సుదర్శన్, సత్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి తక్కువ నిడివితో వస్తున్న ఈ మూవీ ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *