AP 10th Results 2025

AP 10th Results 2025: AP పదో తరగతి రిజల్ట్స్ రిలీజ్ అయ్యేది అప్పుడే ? చెక్ చేసుకోండిలా

AP 10th Results 2025: ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్‌ 23వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఏప్రిల్‌ 23న ఉదయం 10 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా… తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ లేదా https://results.bse.ap.gov.in/ లేదా మనమిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009 ద్వారా కూడా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

ఎలా ఆంటే.. విద్యార్థులు తమ మొబైల్‌ ఫోన్‌లోని వాట్సప్‌లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి. వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి. అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్‌ చేయాలి. అక్కడ రోల్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. ఈ రిజల్ట్‌ పీడీఎఫ్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుఓవచ్చు. అలాగే.. పదో తరగతి రెగ్యులర్‌ పబ్లిక్‌ పరీక్షలతో పాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. ఈ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *