ap politics

AP Politics: చంద్రబాబు అప్పటి హామీ నిలబెట్టుకుంటున్నారు.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ ముగ్గురు ఫిక్స్!

AP Politics: ఏపీలో ఎమ్మెల్సేయే నగారా మోగింది. మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగాలో కూటమి కోసం కృషిచేసిన వారు.. ఆ సమయంలో ప్రత్యేక హామీని సీఎం చంద్రబాబు నుంచి పొందిన వారు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పడబోతున్నట్టు చెబుతున్నారు. 

AP Politics: కాపు నేత ఉద్యోగుల సంఘ నాయకుడు పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీగా చేసిన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆ స్థానంలో టీడీపీ నుండి అదే సామాజిక వర్గానికి అదే జిల్లాకి చెందిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ పేరు దాదాపు ఖరారు అయినట్టేనని చెబుతున్నారు. అయితే, జనసేన నుండి అయితే నాగేంద్ర బాబు పేరు కూడా దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే పదవీకాలం ముగిసిన బీటీనాయుడు స్థానంలో ఈయనకు అవకాశం ఇస్తారని అంటున్నారు. 

AP Politics: పదవి కాలం ముగిసిన బీసీ నేత యనమల రామకృష్ణుడు  సామాజిక వర్గం నుండి ఇప్పటికే శాసన సభ, క్యాబినెట్ చోటు దక్కిన తరుణంలో ఆ స్థానాన్ని మరో బీసీ సామాజికవర్గ నాయకుని కట్టబెట్టే అలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ పని చేసిన వారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. 

AP Politics: మరో టీడీపీ నాయకుడు బీసీ సామాజికవర్గానికి చెందిన దువ్వారపు రామారావు పదవి కాలం ముగియటంతో ఆ సామాజికవర్గానికి ఇప్పటికే శాసన సభలో చోటు దక్కటంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన హామీని నిలబెట్టుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీయే ఎన్నికల్లో సీట్ల కూర్పులో ఇచ్చిన హామీల్లో తొలి శాసన మండలి స్థానం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటికి ఇస్తానని బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వాగ్ధానాన్ని చంద్రబాబు నిలబెట్టుకుంటున్నారని చెబుతున్నారు. డాక్టర్ కొమ్మల పాటికి ఎమ్మెల్సీ ఖరారు చేశారు. డాక్టర్ కొమ్మాలపాటి ఎటువంటి వివాదం లేకుండా తన నియోజవర్గంతో పాటు పల్నాడు జిల్లా 7 స్థానాలు గెలుపుకు జిల్లా పార్టీ పగ్గాలు పట్టి కృషి చేసిన సంగతి విదితమే. 

AP Politics: మండలిలో క్షత్రియ సామాజికవర్గం నుండి ఉపాద్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ప్రతినిధిగా ఉండే వారు ప్రస్తుత మండలిలో కూడా ఆ సామాజికవర్గానికి స్థానం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. సీఎం  చంద్రబాబు ఎన్నికల హామీలో ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలలో రెండవది పిఠాపురం టీడీపీ నేత ఎస్ వి ఎస్ వర్మ. ఆ రెండో హామీని కూడా చంద్రబాబు నెరవేరుస్తున్నట్టు సమాచారం ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని పిఠాపురం వర్మకు ఖరారు చేశారని అంటున్నారు. 

మొత్తానికి చంద్రబాబు హామీ ఇచ్చిన డాక్టర్ కొమ్మాలపాటి, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్సీ నామినేషన్ లాంఛనమే అని తెలుస్తోంది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *