Ap news: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ గా ఉన్న హరీష్‌కుమార్ గుప్తా, 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గత ఎన్నికల ముందు ఈసీ ఆయనను డీజీగా నియమించింది.ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా, ఆయన స్థానంలో హరీష్‌కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.