ap news: MLA వరదరాజులురెడ్డి సంచలన వ్యాఖ్యలు: పోలీస్ శాఖలో అవినీతి పరాకాష్ట

ap news : స్థానిక ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఒక సంచలనాత్మక వ్యాఖ్యతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. ఆయన పోలీస్ శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, అవినీతికి పాల్పడుతున్న అధికారుల పేర్లు వెల్లడించారు.

ముఖ్యంగా ప్రొద్దుటూరు డీఎస్పీ భావనపై తీవ్ర విమర్శలు చేశారు. “భావన మద్యం షాపుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈమె పోలీస్ ఉద్యోగంలో చేరింది అనేది దేశ సేవ కోసమో, లేక అక్రమార్జన కోసమో అనేది ప్రజలు తేల్చుకోవాలి,” అని వరదరాజులురెడ్డి వ్యాఖ్యానించారు.

అంతేకాక, ఇటీవల ఒక అక్రమ రేషన్ బియ్యం లారీని ఈమె వదిలేసిన విషయం పైనా ఆయన ఆరోపణలు చేశారు. “అందులో భారీగా అక్రమాలు జరిగాయి. బాధ్యత వహించాల్సిన స్థాయిలో ఉన్న అధికారులు డబ్బుల కోసం ఈ వ్యవహారాన్ని నీరుగార్చారు,” అని ఆరోపించారు.

ఈ క్రమంలో, డబ్బుల కోసం ఓ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు *మునివర* అనే అమాయకుడిపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు.”ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి శ్రమగా మారుతున్నాయి. నేను ఈ అంశాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తా,” అని ఆయన హచ్చరిక ఇచ్చారు.

ఇకముందు ఇటువంటి అక్రమాలు తాను సహించనని, ప్రజలకు న్యాయం జరగే వరకు పోరాడుతానని వరదరాజులురెడ్డి స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హరీష్ రావు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *