AP news: ఏపీ లిక్కర్ స్కాంలో నలుగురికి కస్టడీ..

AP news: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసు (లిక్కర్ స్కాం)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ రోజు (గురువారం) తీర్పు ఇచ్చింది.

కోర్టు ఆదేశాల మేరకు నిందితులు రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను రెండు రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతించింది.

ఈ నేపథ్యంలో రేపటి నుంచి (శుక్రవారం) రెండు రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. విచారణ సమయంలో న్యాయవాది సమక్షం తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై కఠినంగా స్పందిస్తూ, తీరికనివ్వమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం కుంభకోణంపై ప్రభుత్వ స్థాయిలో సీరియస్ దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కేసు రాజకీయ వాతావరణంలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిందితులపై విచారణ అనంతరం మరిన్ని కీలక సమాచారం వెలుగు చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu: పోలవరాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *