AP News

AP News: వివేకా హత్య కేసులో.. అప్రూవర్‌ దస్తగిరి భార్య షబానాపై దాడి

AP News: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన అనంతపురం జిల్లా తొండూరు మండలం మల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.

షాబానా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఇద్దరు వైకాపా మహిళా కార్యకర్తలు తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి దాడి చేశారని, తమ కుటుంబాన్ని బెదిరించారని తెలిపారు. దస్తగిరిని ఏడాదిలోపు హత్య చేస్తామని మహిళలు ధమకిచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షాబానా భద్రతకు హాని ఉందని ఆమె కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *