AP News: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని గాంధీ బజార్ లో నివసిస్తున్న ఆచారి కుటుంబం కృష్ణ చారి ,సరళ,, సంతోష్, భువనేష్ వీరి స్వగృహంలోనే భార్య భర్తలు ఇద్దరు మగ పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం . సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైని డిఎస్పి ఉదయభావని ,సిఐ నాగేష్ మాట్లాడుతూ బంగారు వ్యాపారం చేసే కృష్ణాచారి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు .కుటుంబ కలహాలతో లేదా ఆర్థిక లావాదేవీలతో చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. చనిపోయిన మృతుని జేబులో సెనైడ్ సంబంధించినటువంటి ఒక కవర్ ఉంది.
ఇది కూడా చదవండి : Crime News: స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త.. ఎందుకంటే..?
AP News: వీరు బంగారు వ్యాపారం చేస్తారు గనుక వాళ్ళ సోదరుడు తెలిపిన ప్రకారం సెనైడ్ వాటర్ బాటిల్లో కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు . బాధాకరమైన విషయం ఏమిటంటే శ్రద్ధ స్కూల్లో చదువుతున్న హాస్టల్లో ఉన్న ఇద్దరు పిల్లలు నిన్నటి రోజే ఇంటికి రావడం జరిగింది అందులో ఒక పిల్లవాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు టాపర్ కూడా అని పట్టణ సీఐ నగేష్ తెలిపారు.
ట్రైని డిఎస్పీ ఉదయ పావని మాట్లాడుతూ బంగారు వ్యాపారం చేసే కృష్ణచారి కుటుంబం ఆత్మహత్య విషయాన్ని ఉన్నతాధికారులకు , రెస్క్యూ టీం కు తెలిపాం.సంఘటన స్థలానికి వచ్చి విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.