AP News:

AP News: చీరాల‌లో అగ్నిప్ర‌మాదం

AP News: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చీరాల పట్ట‌ణంలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. చీరాల‌లోని విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ వ‌ద్ద వాడ‌రేవు-పిడుగురాళ్ల జాతీయ ర‌హ‌దారి ప‌నుల‌కు వినియోగిస్తున్న ఓ భారీ మొబైల్ క్రేన్ ఈ ప్ర‌మాదం ద‌గ్ధ‌మైంది. దాని ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంట‌లు చెల‌రేగ‌డంతో క్రేన్ ఇంజిన్ భాగం మంట‌ల్లో పూర్తిగా క‌లిపోయింది. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను వ్యాపించ‌కుండా అదుపులోకి తీసుకొచ్చారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ న‌స్టం త‌ప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *