AP news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. సర్వీసు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో ఆదివారం ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో సీఐడీ చీఫ్‌గా పని చేసిన సమయంలో, ఆయన ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. జార్జియాకు వెళ్లినప్పుడు మాత్రమే అనుమతి తీసుకున్నారని, కానీ స్వీడన్, యూకే, యూఏఈ సహా ఇతర దేశాలకు పర్యటనలకు ఎలాంటి అనుమతి పొందలేదని సమాచారం.
ఈ ఆరోపణలపై ప్రభుత్వం సిసోడియా నేతృత్వంలోని కమిటీ ద్వారా విచారణ జరిపించింది. విచారణలో సునీల్ కుమార్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ప్రవర్తించినట్టు కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
విదేశీ పర్యటనలతో పాటు, సునీల్ కుమార్‌పై పలు ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో కూడా సునీల్ కుమార్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక, గతంలోనూ ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిర్బంధాల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని అధికారులను ఆదేశించారని ఆరోపణలు వస్తున్నాయి.