AP News: బాహుబలి సినిమాలో శివగామి ఓ నదిలో ఈదుకుంటూ తన కొడుకైన మహేంద్ర బాహుబలిని బాల్యంలో రెండు చేతులతో ఎత్తి పట్టుకొని వెళ్లి అతడిని కాపాడి, ఆమె ప్రాణాలిడుస్తుంది.. ఈ సీన్ ప్రేక్షక లోకాన్ని కట్టిపడేసింది. ఆ సినిమా దర్శకుడు రాజమౌళి దర్శక చాతుర్యానికి ఇది ఓ మచ్చుతునకగా అందరూ మెచ్చుకుంటారు. మరి ఇలాంటి సీన్ నిజ జీవితంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో చోటు చేసుకున్నది.
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాహుబలి సీన్ రిపీట్ అయింది. పాడేరు పెదబయలు మండలంలోని పెద కోడపల్లి పంచాయతీ పరిధిలో చెక్కరాయికి వెళ్లే వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నది. తన కొడుకు సహా దాన్ని దాటేందుకు ఓ గిరిజనుడు పెద్ద సాహసమే చేశాడు. అదే బాహుబలి సీన్‌ను అచ్చుగుద్దాడు.
AP News: తన కొడుకును బుజాలపై ఎత్తుకొని, భుజాల వరకూ నీటి ప్రవాహం ఉన్న ధైర్యంతో వాగును దాటుకుంటూ వచ్చాడు ఆ వ్యక్తి. నిత్యం ఇదే వాగును దాటుతూ తమ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. తాజాగా భారీ వర్షాలతో వాగులో వరద పెరిగింది. కానీ, జ్వరంతో బాధపడుతున్న తన కొడుకును ఆసుపత్రిలో చూపించేందుకు ఇలా సాహసం చేయాల్సి వచ్చిందని చెప్పారు. నిత్యం గిరిజనులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.