AP NEW DISTRICSTS:

AP NEW DISTRICSTS: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌.. ఆ కొత్త జిల్లాలు ఇవేనా?

AP NEW DISTRICSTS: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జిల్లాల మార్పున‌కు అడుగులు ప‌డుతున్నాయా? కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినిపిస్తున్న మాట‌లు త్వ‌ర‌లో నిజ‌మ‌వుతాయా? అస‌మ‌గ్రంగా ఆనాడు ఏర్పాటైన జిల్లాల్లో మార్పులు, చేర్పులు జ‌రుగుతాయా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఈ మేర‌కు స‌ర్కారు అడుగులు వేస్తున్న‌ద‌ని తెలుస్తున్న‌ది. ఓ 10 రోజుల్లోగా జిల్లాల మార్పులు, చేర్పుల‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.

AP NEW DISTRICSTS: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ కోసం రాష్ట్ర మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ నేతృత్వంలో ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. వ‌చ్చే డిసెంబ‌ర్ 31 నాటికి క‌మిటీ నివేదిక పూర్తిచేయాల‌న్న డెడ్‌లైన్‌తో ఆ క‌మిటీలో తాజాగా క‌దలిక వ‌చ్చింది. ఇటీవ‌లి వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సూప‌ర్ సిక్స్ అమ‌లు, సుప‌రిపాల‌న‌పై దృష్టి పెట్ట‌గా, తాజాగా జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ది.

AP NEW DISTRICSTS: వచ్చే వారంరోజుల పాటు మంత్రులు జిల్లాల ఏర్పాటు, మార్పు, చేర్పుల‌పై దృష్టి పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలు జారీచేసిన‌ట్టు తెలిసింది. దీంతో జిల్లాల్లో మంత్రులు ఆ మేర‌కు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తున్న‌ది. అధికారుల‌తో, పార్టీల క్యాడ‌ర్‌తో చర్చిస్తున్న‌ట్టు స‌మాచారం. అంద‌రి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకునేందుకు యోచిస్తున్నార‌ని తెలిసింది.

AP NEW DISTRICSTS: ఈ మేర‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు జిల్లాల ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌పై వార్త‌లు అందుతున్నాయి. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం నుంచి జిల్లా కేంద్ర‌మైన పాడేరు దూరంగా ఉన్న‌ది. సుమారు 3 గంట‌ల పాటు ప్ర‌యాణిస్తే త‌ప్ప అక్క‌డికి వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌జాప్ర‌తినిధులు తెలుప‌గా, ప్ర‌త్యేక జి్ల‌లా ఏర్పాటుకు రెడీ చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో ర‌పంచోడ‌వ‌రం డివిజ‌న్‌తోపాటు చింతూరు డివిజ‌న్‌లోని 4 విలీన మండ‌లాల‌ను క‌లిపి చింతూరు లేదా రంప‌చోడ‌వ‌రం పేరుతో జిల్లాను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉన్న‌ది.

AP NEW DISTRICSTS: అదే విధంగా గిద్ద‌లూరు, క‌నిగిరి, మార్కాపురం, య‌ర్ర‌గొండ‌పాలెం, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిసింది. నిజానికి గ‌తంలోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ తొలినాళ్ల‌లోనే ఉండ‌గా, అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని స్థానికులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం మార్కాపురం జిల్లా ఏర్పాటుకే మొగ్గుచూపుతుంద‌ని తెలుస్తున్న‌ది.

AP NEW DISTRICSTS: ఒంగోలు, కొండ‌పి, సంత‌నూత‌ల‌పాడు, అద్దంకి, కందుకూరు నియోజ‌కవ‌ర్గాల‌తో క‌లిపి ప్ర‌కాశం జిల్లాను ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలుస్తున్న‌ది. వేరుగా ఉన్న అద్దంకి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌కాశం జిల్లాలో క‌లుపుతార‌ని స‌మాచారం. మొత్తంగా ఆ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌లిపి ఒక జిల్లాగా ఏర్ప‌డుతుంద‌ని స‌మాచారం.

AP NEW DISTRICSTS: ఏపీ రాజ‌ధాని న‌గ‌ర‌మైన అమ‌రావ‌తి పేరిట కూడా ప్ర‌త్యేక జిల్లాను ఏర్పాటు చేయాల‌ని కూట‌మి స‌ర్కారు యోచ‌న‌గా ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. అమ‌రావ‌తి కేంద్రంగా కొత్త‌గా అర్బ‌న్ జిల్లాను ఏర్పాటు చేస్తార‌ట‌. ఈ జిల్లాలో రాజ‌ధాని ప‌రిధిలోని 29 గ్రామాల‌తో పాటు మంగ‌ళ‌గిరి, తాడికొడ నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తాయి. అదే విధంగా పెద‌కూర‌పాడు, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఈ అమ‌రావ‌తి జిల్లాలోనే క‌లుప‌నున్న‌ట్టు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *