Crime News

Crime News: ఏపీలో మరో ఘోరం.. ఆ వాగులో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య!

Crime News: ఆ అమ్మాయి కనిపిచ్న్హకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళింది ఎవరితో వెళ్ళింది తెలియదు. ఇంజినీరింగ్ చేసే ఆ అమ్మాయి ఇప్పుడు శవంలా కనిపించిందని. కారణం ఏంటి ? చంపారా ? లేక వేరే ఏదైనా కారణం ఉందా ? అంటే అదే కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు.

కోటి ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుని ఉన్నత చదువులతో కుటుంబానికి అండగా ఉంటుందని భావించిన తల్లి తండ్రులు ఆశలు ఆవిరి,అర్ధాంతరంగా దుర్భరస్థితి లో శవమైన ఆడబిడ్డ…తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది… యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో కొద్ది రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని భావించారు.

దీంతో ఈ నెల 21 న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా నమోదు అయిన నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన లేహనిస్సి గా గుర్తించారు..ఈ క్రమంలో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరో వైపు విద్యార్థిని మృతి పట్ల హత్యా లేక ఆత్మహత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు అని చెప్పి వెళ్లిన విద్యార్థిని నేడు గూడూరు పంబలేరు వాగులో శవమై తేలడంతో మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు..విద్యార్థిని మృతి పట్ల ఇప్పటివరకూ ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం స్పందించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. తనను పెళ్లి చేసుకోబోయే చైతన్య అనే అబ్బాయికి మృతురాలు లేఖ రాసింది. చైతన్యను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని.. అతనంటే తనకెంతో ఇష్టమంటూ లేఖలో పేర్కొంది. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను నోటులో ఎక్కడా ప్రస్తావించలేదు..యువతి అదృశ్యం అనంతరం..ఇంట్లో ఉన్న నోట్‌ను కుటుంబ సభ్యులు గుర్తించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *