Crime News: ఆత్మీయతగా మొదలైన పరిచయం, చివరకు హత్యకు దారి తీసింది. ట్రాన్స్‌జెండర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి, ఈ విషయం బయటపడుతుందనే భయంతో ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండల పరిధిలో చోటు చేసుకుంది.
ఒక పరిచయం.. మూడు జీవితాల విషాదం
మంగళగిరి మండలానికి చెందిన కాశీనా ఈశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావు, ఓ ప్రైవేట్ ఆరోగ్య సంస్థలో హెచ్ఐవీ బాధితులకు ఔషధాల పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో రఫీ అలియాస్ నర్మద అనే ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
అప్పటి నుంచి అనుమానాలు..
ఇక ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ ద్వారా తెనాలి మార్సిన్‌పేటకు చెందిన దీపక్ అనే యువకుడు నర్మదతో పరిచయమయ్యాడు. అది క్రమంగా అక్రమ సంబంధం దానికి దారి తీసింది. దీన్ని గమనించిన దీపక్ భార్య, కోటేశ్వరరావుతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మూడు వైపులా కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఈ సంఘటనతో పరువు పోతుందనే భయంతో దీపక్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.
ఇది కూడా చదవండి: illegal drugs: డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ప్రముఖ హాస్పటల్ డాక్టర్
చివరికి హత్యకు పాల్పడ్డ నిందితుడు
పోలీసుల దర్యాప్తులో, కోటేశ్వరరావే తమ అక్రమ సంబంధాన్ని బయటపెడతాడని అనుమానించిన దీపక్, గుర్తు తెలియని వ్యక్తులతో అతన్ని హత్య చేయించాడు. మంగళగిరి సమీపంలోని పెదవడ్లపూడి శివారులో బుధవారం రాత్రి, కోటేశ్వరరావును క్రూరంగా కత్తితో నరికి హత్య చేశారు.
కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది
ఈశ్వరరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి, నర్మదను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.