AP Inter Exams 2026

AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!

AP Inter Exams 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కి టైమ్ అయింది.  ఈనెల ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ప్రకటించింది. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.  దీనిని దృష్ట్రీలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.

పరీక్షల షెడ్యూల్ – అభ్యర్థుల వివరాలు

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో ప్రారంభం కానున్నాయి. సెకండ్ ఇయర్  విద్యార్థులకు ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2తో పరీక్షలు మొదలవుతాయి.

  • మొత్తం విద్యార్థులు: సుమారు 10.57 లక్షల మంది.
  • పరీక్షా కేంద్రాలు: 1,537 కేంద్రాలు.
  • సమయం: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.

పకడ్బందీగా నిఘా – సీసీటీవీ పర్యవేక్షణ

పరీక్షల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా తప్పనిసరి చేసింది. బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఈ కెమెరాల ఫీడ్‌ను లైవ్‌లో పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 45 కేంద్రాలను ‘అతి సున్నితమైనవి’గా గుర్తించి, అక్కడ అదనపు భద్రతను – సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ (కాపీయింగ్) నిరోధించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నిరంతరం తనిఖీలు చేస్తాయి.

విద్యార్థులకు కీలక సూచనలు

  • హాల్ టికెట్లు: ఇప్పటికే హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ వివరాలను సరిచూసుకుని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి.
  • సమయ పాలన: పరీక్ష ప్రారంభం కావడానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9:00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

నిషేధిత వస్తువులు: మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరీక్షా గదిలోకి అనుమతించబడవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *