Inter Results: ఈ నెల 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రిజల్ట్స్‌ను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో, మన మిత్ర నంబర్ 95523 00009కు హాయ్ అని సందేశం పంపి చూసుకోవచ్చు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది పరీక్షలకు మొత్తం 10,58,892 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల కృషి రేపటి ఫలితాల్లో ప్రతిబింబించాలని, ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరవాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.

