AP Assembly: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక కార్యక్రమాలు:
పెన్షన్లు రూ. 4 వేలకు పెంపు
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేత
ఐటీ రంగం నుంచి ఏఐ విప్లవం దిశగా అడుగులు
రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షణ
అలాగే, సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని గవర్నర్ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో భూమి సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నామని, అన్న క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. పీఎం సూర్య ఘర్ యోజన కింద రాష్ట్రవ్యాప్తంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తోందని వివరించారు.
Also Read: Pawan Kalyan: జగన్ కు ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..
గవర్నర్ ప్రసంగంపై వైసీపీ నిరసన
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ సహా పలువురు ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. సభ్యులంతా కొద్దిసేపటికే వాకౌట్ చేశారు. రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీలు ఉన్నందున, తమను అధికారిక ప్రతిపక్షంగా గుర్తించాలని బొత్స సత్యనారాయణ కోరారు. ప్రజా సమస్యలపై గళమెత్తాలంటే ప్రతిపక్ష హోదా అవసరమని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.