AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్, పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గార్లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలియజేసింది.
Also Read: Electric Bike: ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు.. 9 నెలల చిన్నారి, తండ్రి మృతి!
AP Government: తెలుగు సినిమా పరిశ్రమకు మౌలిక సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాలని నిర్మాతల మండలి సూచించింది. నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణుల అభివృద్ధి కోసం భూకేటాయింపు చేపట్టాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను గౌరవ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ గార్లకు సమర్పించారు. అలాగే నంది అవార్డులను పునరుద్ధరించి, పెండింగ్‌లో ఉన్న అవార్డులను అందజేయాలని కూడా నిర్మాతల మండలి అభ్యర్థించింది.
