Amaravati: ఏపీకి 17వేల మెట్రిక్ టన్నుల యూరియా

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ యూరియా సరుకు కాకినాడ పోర్టులో దిగుమతి అవుతుందని అధికారులు తెలిపారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అత్యవసరంగా జిల్లాలకు యూరియాను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యుద్ధప్రాతిపదికన యూరియా పంపిణీ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Janasena Formation Day: జ్యోతి ప్రజ్వలనతో మొదలైన "జయకేతనం" సభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *