AP Free Bus Scheme: స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు సోమవారం (ఆగస్టు 11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నది.
AP Free Bus Scheme: స్త్రీ శక్తి పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8,458 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలోని మంగళగిరి పట్టణంలో ఈ పథకాన్ని ప్రారంభించి, మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
AP Free Bus Scheme: ఈ పథకం ద్వారా 74 శాతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ప్రయాణికుల రద్దీ మేరకు డ్రైవర్లు, కండక్టర్లు కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా మరో రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఈ పథకానికి సంబంధించి ఏఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, ఏ గుర్తింపు కార్డులు వర్తిస్తాయి అన్న వివరాలను ప్రకటించనున్నారు.