Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు బిజీగా కొనసాగుతోంది. రాష్ట్రంలో పోర్టులు, నగరాల అభివృద్ధి, క్రీడల ప్రోత్సాహం వంటి అంశాలపై పలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో సీఎం బృందం చర్చలు జరపనుంది.
ముఖ్య సమావేశాలు.. సమయాల వారీగా
-
ఉదయం 7.00 (భారత కాలమానం ప్రకారం):
సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డా. టాన్ సీ లెంగ్‌తో భేటీ.
విషయాలు: విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారం. -
ఉదయం 8.30:
ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరిలతో సమావేశం. -
ఉదయం 9.00: హనీవెల్ సంస్థ ప్రతినిధులతో చర్చ.
-
ఉదయం 9.30 నుంచి 11.00 వరకు:బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం
విషయం: “నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మరలడం – కార్మిక శక్తి వేగవంతం”
పాల్గొనేవారు: నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్శిటీ, సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ & డిజైన్ విద్యార్థులు. -
ఉదయం 11.00: ఎవర్వోల్ట్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్తో భేటీ.
-
ఉదయం 11.30: సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శన
విషయం: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధి ప్రణాళికలపై చర్చ. -
మధ్యాహ్నం 1.00: టువాస్ పోర్ట్ సైట్ పర్యటన
పీఎస్ఏ సీఈవో విన్సెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ
విషయం: పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, ఎగుమతి సదుపాయాలు. -
సాయంత్రం 4.30: ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షో
విషయం: రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రసంగం.
పాల్గొనేవారు: సింగపూర్, అంతర్జాతీయ పెట్టుబడిదారులు. -
సాయంత్రం 6.00: అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో భేటీ
విషయం: ఆంధ్రప్రదేశ్ పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై చర్చ.
ప్రధాన లక్ష్యం
ఈ పర్యటన ద్వారా పోర్టులు, క్రీడలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి, పరిశ్రమలకు పెట్టుబడులు వంటి అంశాలను సింగపూర్‌లోని ప్రముఖ సంస్థలతో అనుసంధానం చేయడం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం…బీసీ రిజర్వేషన్‌పై చర్చ