Chandra Babu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు అవమానం జరిగింది. అక్కడి అధికారుల నిర్లక్ష్యంతో ఈ విపరీతం చోటుచేసుకున్నది. కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు ముద్రించకుండానే ఆహ్వానపత్రికను, బ్రోచర్‌ను ముద్రించారు.
నిర్వాహకులైన అధికారులు కనీస ప్రొటోకాల్ పాటించాలనే విషయం తోచకపోవడం గమనార్హం. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును అధికారులు మరిచిపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.