Operation Sindoor

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌పై ఏపీ చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్పందన.!

Operation Sindoor: భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్‌ సింధూర్‌” దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత దళాలు చేపట్టిన ఈ దాడి గట్టి సందేశాన్ని పంపింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఈ చర్యతో దేశ ప్రజల న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘జైహింద్’ అంటూ స్పందించగా, మంత్రి నారా లోకేష్ ‘న్యాయం జరిగింది’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా “జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం… భారత్ మాతాకీ జై” అంటూ ట్వీట్ చేశారు.

Operation Sindoor: భారత సైన్యం నిర్వహించిన ఈ దాడితో ఉగ్రవాద గుంపుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పాక్‌పై బాంబుల వర్షం కురిపించిన భారత దళాల చర్యతో, పాకిస్థాన్ అంతర్జాతీయంగా మద్దతు కోసం అమెరికా వంటి దేశాలను ఆశ్రయించడం ప్రారంభించింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందా? అనే ఆందోళన సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.

Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్..ఉత్తర భారతంలో పలు విమానాశ్రయాలు మూసివేత

ఈ నేపథ్యంలో ఎక్స్‌ (ఇటీవలి ట్విట్టర్)లో #IndiaPakistanWar అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలవగా, #OperationSindoor కూడా దూసుకెళుతోంది.

ఇండియా అంతటా పౌరులు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఆపరేషన్ దేశ భద్రతపై భారత ప్రభుత్వ నిర్దాక్షిణ్య వైఖరిని చూపించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *