Ap cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ఉదయం 10 నుంచి జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ సాగుతుంది. 43వ సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అమరావతిలో రూ.20,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి ప్రభుత్వం అనుమతులు ఇచ్చే అంశంపై కేబినెట్‌లో చర్చ జరుగుతుందని తెలుస్తుంది. సీఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదించిన పలు ప్రాజెక్టులపై కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది.
పిడిఎస్ రైస్‌ను విదేశాలకు తరలిపోకుండా అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశం కూడా చర్చలో ఉంటుంది. విజయవాడ బుడమేరుకు చెందిన ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ చేసేందుకు స్టాంపు డ్యూటీ మినహాయింపుపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పలు పరిశ్రమల భూ కేటాయింపుల విషయంలో కూడా జరుగుతుందని సమాచారం.