AP 10th Results 2025: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమైన రోజు ఇది! రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పదవ తరగతి (SSC) పరీక్షల ఫలితాలను నేడు ఉదయం 10:00 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) పర్యవేక్షణలో విద్యాశాఖ ఆన్‌లైన్‌లో ప్రకటించనుంది.
ఎక్కడ చూడాలి ఫలితాలు?
విద్యార్థులు, తల్లిదండ్రులు పలు వేదికల ద్వారా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు:
-
ఆధికారిక వెబ్‌సైట్లు:
🔹 bse.ap.gov.in
🔹 apopenschool.ap.gov.in -
వాట్సాప్ లో:
👉 9552300009 నంబర్‌కి “Hi” అని మెసేజ్ పంపండి
👉 “Education Services” ఎంచుకోండి
👉 “SSC Results” సెలెక్ట్ చేసి, మీ రోల్ నంబర్ నమోదు చేయండి
👉 వెంటనే PDF రూపంలో ఫలితం మీకు వస్తుంది! -
LEAP మొబైల్ యాప్ ద్వారా కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ లాగిన్‌తో ఫలితాలను పొందొచ్చు.
స్కూళ్ళకు ప్రత్యేక వెసులుబాటు:
ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ద్వారా ఫలితాల వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో విద్యార్థులందరికీ తక్షణమే సమాచారం అందుబాటులోకి వస్తుంది.
ఈసారి పరీక్షల విశేషాలు:
-
పరీక్షా తేదీలు: మార్చి 17 నుండి 31 వరకు
-
కేంద్రాల సంఖ్య: 3,450
-
మొత్తం హాజరు అయిన విద్యార్థులు: 6,19,275
🔹 బాలురు – 3,17,939
🔹 బాలికలు – 3,05,153
ఈ ఫలితాలను రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.