Anushka Shetty

Anushka Shetty: స్వీటీ షాకింగ్ నిర్ణయం! సినిమా ఈవెంట్లకు దూరం ఎందుకు?

Anushka Shetty: అనుష్క శెట్టి.. తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ భామ, ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది. బాహుబలి టీమ్ ఇటీవల జరిగిన రీయూనియన్‌లో ప్రభాస్, రాజమౌళి, రానా లాంటి వారు హాజరైనా, అనుష్క మాత్రం కనిపించలేదు. ఆమె తాజా చిత్రం ఘాటీ ప్రమోషన్లలో కూడా ఆమె లేకపోవడం గమనార్హం. దీని వెనుక కారణం ఆమె వ్యక్తిగత సమస్యలని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Shiva Rajkumar: ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా..!?

సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క, తర్వాత సన్నబడే ప్రయత్నంలో శారీరక ఇబ్బందులు ఎదుర్కొందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె బహిరంగ కార్యక్రమాలకు రావడం మానేసినట్లు సమాచారం. షూటింగ్ సెట్స్‌లో కూడా తక్కువ మందితోనే పనిచేస్తున్న ఆమె, సీజీ టెక్నాలజీ సహాయంతో సన్నగా కనిపించేలా చిత్రీకరణ జరుపుతోందట. అయినప్పటికీ, సన్నబడేందుకు ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తోందని, అది సఫలమైతేనే మళ్లీ బయటకు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *