Ghaati: టాలీవుడ్ స్టార్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ చిత్రం ‘ఘాటి’ రిలీజ్‌పై మరో షాకింగ్ అప్‌డేట్ వచ్చింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, తాజాగా వాయిదా పడినట్లు సమాచారం. రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.
Also Read: OG: ఓజీ ఫస్ట్ సింగిల్ రెడీ.. ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం!
వాయిస్ ఓవర్: అనుష్క శెట్టి ఫ్యాన్స్‌కు షాక్! క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘాటి’ చిత్రం రిలీజ్ మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ క్రైమ్ థ్రిల్లర్, ఇతర చిత్రాలతో పోటీ కారణంగా వెనక్కి తగ్గింది. యూవి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో అనుష్క దమ్మున్న పాత్రలో మెప్పించనుందని టాక్. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఖాళీ స్లాట్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అనుష్క పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇలా వరుసగా వాయిదాలు పడుతుంటే కష్టమే అంటున్నారు అనుష్క అభిమానులు. మరి, ఈ భారీ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.