jani master: లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది. జానీ మాస్టర్‌పై లైంగికదాడి కేసు పెట్టిన ఆ యువతిపైనే ఆయన బంధువు అయిన ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిన ఆ యువతి తనను లైంగికంగా వేధించిందంటూ ఆ యువకుడు ఆమెపై ఆరోపణలు చేశాడు.
jani master: తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నై నగరాల్లో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె తనపై ఈ చర్యలకు పాల్పడిందని చెప్పాడు. ఆ యువతి లిఫ్ట్‌లు, రెస్ట్ రూములు, లాడ్జీల్లో తనపై లైంగికదాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని పోలీసులకు ఇచ్చిన ఆ ఫిర్యాదులో యువకుడు పేర్కొన్నాడు. అప్పడు తాను మైనర్‌నని, తనపై లైంగికదాడి చేసిన ఆ యువతిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడం కొసమెరుపు.

