Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న అఖండ 2 తాండవం చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పూర్తి వేగంతో జరుగుతోంది. తాజాగా, ఓ ఉర్రూతలూగించే నదీ ప్రవాహంలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ హై-ఇంటెన్సిటీ సీన్స్‌లో బాలయ్య డేరింగ్ పెర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
Also Read: Nara Lokesh: మా పవన్ అన్న సినిమా కోసం.. ఓ అభిమానుల్లాగే ఎదురు చూస్తున్నాను
జార్జియా, ప్రయాగ్‌రాజ్, హైదరాబాద్‌తో పాటు బిళ్ల స్వర్గం గుహల్లోనూ కీలక సన్నివేశాలు తెరకెక్కాయి. సినిమాలో ఈ సీన్స్ చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ రావడం పక్కా అని మూవీ టీం నుంచి సమాచారం. థమన్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్‌గా నిలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం ఆగట్లేదు.