Yash Dayal: ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) పేసర్ యశ్ దయాళ్‌పై మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గతంలో ఘజియాబాద్‌లో ఒక మహిళ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, తాజాగా జైపూర్‌లో మరో మహిళ ఇదే తరహా ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. జైపూర్‌లోని సంగానర్ పోలీస్ స్టేషన్లో యశ్ దయాళ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలు తన ఫిర్యాదులో, యశ్ దయాళ్ తనను రెండు సంవత్సరాల పాటు పదే పదే లైంగికంగా వేధించాడని ఆరోపించింది. క్రికెట్ కెరీర్ విషయంలో సహాయం చేస్తానని నమ్మించి, తనను ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేశాడని ఆమె పేర్కొంది. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు (17 సంవత్సరాల వయస్సులో) జైపూర్‌లో జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దయాళ్ను కలిసినట్లు ఫిర్యాదులో ఉంది.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌కు గాయం: ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్, టీమిండియాకు షాక్!
ఆ తర్వాత దయాళ్ తనను కెరీర్ సలహా పేరుతో సితాపురలోని ఒక హోటల్‌కు ఆహ్వానించాడని, అక్కడ మొదటిసారి లైంగిక దాడి జరిగిందని ఆమె ఆరోపించింది. ఈ దాడులు రెండు సంవత్సరాల పాటు కొనసాగాయని, ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఈ వేధింపులు ప్రారంభమయ్యాయని పేర్కొంది. దీంతో పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో, ఘజియాబాద్‌కు చెందిన ఒక మహిళ యశ్ దయాళ్‌పై లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 69 కింద కేసు నమోదైంది. ఆ మహిళ, దయాళ్‌తో ఐదు సంవత్సరాల సంబంధం ఉందని, పెళ్లి చేసుకుంటానని అబద్ధపు వాగ్దానాలు చేసి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తనను వాడుకున్నాడని ఆరోపించింది. ఈ కేసులో దయాళ్ అరెస్టుపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది.
