Odela 3: మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా, టాలెంటెడ్ నటుడు వశిష్ట కీలక పాత్రలో నటించిన డివోషనల్ హారర్ డ్రామా ‘ఓదెల 2’ నేడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో యంగ్ డైరెక్టర్ అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో రిలీజై సూపర్ రెస్పాన్స్ అందుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా రిలీజ్‌తో పాటు మేకర్స్ ‘ఓదెల 3’ని కూడా అధికారికంగా అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో మూడో భాగం కూడా ప్రేక్షకులను అలరించనుందని అంటున్నారు.
‘ఓదెల 2’లో తమన్నా నటన, హారర్ ఎలిమెంట్స్, డివోషనల్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టాక్. అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం, డి. మధు నిర్మాణ విలువలు చిత్రానికి బలం. మరి, ‘ఓదెల 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా సక్సెస్‌తో ‘ఓదెల 3’పై అంచనాలు ఇప్పటినుంచే మొదలయ్యాయి.