Thandel

Thandel: తండేల్ ఖాతాలో సెన్సేషనల్ రికార్డ్!

Thandel: లేటెస్ట్ గా వచ్చిన సూపర్ హిట్ చిత్రం “తండేల్”. అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ రియల్ లైఫ్ స్టోరీ నాగ చైతన్యకి సూపర్ కం బ్యాక్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంకి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఏ రేంజ్ లో ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ముఖ్యంగా ఈ సినిమాలో దేవి కంపోజ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్ అయితే చార్ట్ బస్టర్ అయిపోయింది. ఈ పాట ఇప్పటికీ సంచలనమే.. ఇదిలా ఉండగా ఈ సాంగ్ లేటెస్ట్ గా ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రికార్డు మైల్ స్టోన్ ని అందుకుంది. దీనితో బుజ్జితల్లి హవా ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రెండో వీకెండ్ లో కూడా మళ్ళీ తండేల్ మంచి బుకింగ్స్ చూపిస్తుండగా ఈ వీకెండ్ కి భారీ వసూళ్లు రావడం పక్కా అని తెలుస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  RRR: ‘ఆర్ఆర్ఆర్’కి అరుదైన గౌరవం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *