Hyderabad: తెలంగాణలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పై మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన పెద్దఅంబర్‌పేట సమీపంలో జరిగింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ట్రావెల్స్కు చెందిన ఈ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత 24 గంటల్లోనే కర్నూలు వద్ద మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన మరువకముందే, ఓఆర్‌ఆర్‌పై ఈ ప్రమాదం జరగడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

