38th National Games

38th National Games: తెలంగాణ అమ్మాయిలకు మరో పతకం..! కాంపౌండ్ ఆర్చరీ లో కాంస్యం

38th National Games: ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్ లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది.

ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. రాష్ట్రం తరఫున బరిలోకి దిగిన చికిత, మనసనయన, శేష్ఠరెడ్డి, మన్సూర్ హసిబా 232 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.

ఇకపోతే గత సంవత్సరం జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించిన చికిత్స రావు మరొకసారి ఈవెంట్ లో పతకాన్ని సాధించింది. రాష్ట్ర జాతీయ క్రీడల్లోనే కాకుండా ఈ మధ్య అంతర్జాతీయ పోటీల్లో కూడా సత్తా చార్టెడ్ నైపుణ్యమున్న చికిత రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పేరుని, గౌరవాన్ని అపారంగా పెంచుతుంది అని క్రీడా వర్గాల భావిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Karnataka: కర్నాటకలో వివాదాస్పద వైద్యం: ఫెవిక్విక్‌తో చికిత్స ఇచ్చిన నర్సు సస్పెండ్

ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోటీల్లో తెలంగాణ ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇదే విభాగంలో పంజాబ్(228), మహారాష్ట్ర(227) ఆర్చర్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఒక స్వర్ణం, మూడు కాంస్యాలతో తెలంగాణ ప్రస్తుతం 25వ స్థానంలో కొనసాగుతున్నది.

ఇక ఈ జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారుల హవా కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బరిలో జరిగిన ఆటగాళ్లలో ముఖ్యంగా అమ్మాయిల ప్రదర్శన అయితే ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ వంట క్రీడల్లో సత్తా చాటుతూ తమ తోటి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు ఇక తెలుగువాళ్లు పథకాల సాధించే మరిన్ని క్రీడలు రాబోయే రోజుల్లో జరుగుతుండడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Stock Market: కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్.. రూ.3 లక్షల కోట్లు నష్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *