Kuppam

Kuppam: కుప్పంలో మరో ఘటన… మహిళపై ఆ నాయకుడి దౌర్జన్యం !

Kuppam: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వరుస ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రజల్లో కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తగా, ఇప్పుడే మరో ఘోరమైన సంఘటన బయటపడింది.

భూమిపై కన్నేసిన నేత..?

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ 20 ఏళ్లుగా తన స్వంత 2.72 ఎకరాల భూమిలో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ భూమిపై బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు అదే భూమిపై స్థానిక టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు తనదేనంటూ రావడం మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి: By elections: 4 రాష్ట్రాల్లో ముమ్మ‌రంగా ఐదు అసెంబ్లీ స్థానాల‌ ఉప ఎన్నిక‌లు

రమాదేవి ఆరోపిస్తూ చెప్పింది ఏమిటంటే – కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగరాజు నాయుడు నకిలీ పత్రాలు సృష్టించి తన భూమిని వేరొకరి పేరిట మార్చిస్తున్నాడని, పైగా భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నాడట. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, వాళ్లు ఏమీ పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు.

సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న మహిళ

తన మాటకు అధికారుల నుండి స్పందన లేకపోవడంతో, రమాదేవి తన బాధను వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “మా భూమిని మాపై తిరిగి ఇవ్వండి. మా కుటుంబానికి ఏమైనా జరిగితే దీనికి కారణం టీడీపీ నాయకులే అవుతారు” అంటూ స్పష్టం చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంది.

ప్రభుత్వం స్పందించాలన్న ప్రజల డిమాండ్

ఇప్పటికే చెట్టుకు కట్టిన ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించి బాధితురాలికి ఆర్థిక సాయం అందించగా, ఇప్పుడు ఈ భూమి వివాదం కూడా తీవ్ర దృష్టిని ఆకర్షిస్తోంది. వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్టాపరంగా ముప్పుగా మారే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *