Annapurna Studios

Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త ప్రయోగం?

Annapurna Studios: ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ మొదటిసారిగా నాన్-తెలుగు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయనుంది. మలయాళంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ ‘EKO’ని ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తోంది. నవంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Samantha: రవితేజతో సమంత జోడీ..?

అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటివరకూ తెలుగు చిత్రాలకే పరిమితమై ఉంటే, ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘EKO’కు ఏపీ, టీఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు సొంతం చేసుకున్నారు. కేరళ కొండల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్ హీరోగా.. వినీత్, నరైన్, బిను పప్పు, అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. డింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించగా, బహుల్ రమేష్ సినిమాటోగ్రాఫర్‌గా, రచయితగా రెండు పాత్రలు పోషించారు. ముజీబ్ మాజీడ్ సంగీతం అందించాడు. అన్నపూర్ణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియా యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘‘కొత్త ఆలోచనలు ఉన్న చిత్రాలను ప్రోత్సహించడం మా లక్ష్యం. మలయాళ చిత్రాన్ని మొదటిసారి డిస్ట్రిబ్యూట్ చేయడం గర్వకారణం’’ అని చెప్పారు. నవంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *