తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు.
విజిలెన్స్ విచారణ అంటనే వైవీ సుబ్బారెడ్డికి వెన్నులో వణుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తప్పు చేయని వారు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సిట్ (SIT)ను ఏర్పాcటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర సిట్ ఉంటేనే విచారణలో రాజకీయ జోక్యం ఉండదని ధర్మాసనం పేర్కొంది.55

