Anitha: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ పై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అప్పటి నాయకులను మెప్పించేందుకు నిబంధనలకు విరుద్ధంగా పని చేశారని, అందుకే ఇప్పుడు వారు చట్టపరంగా సమస్యల్లో పడుతున్నారని ఆమె అన్నారు.
కాదంబరి జెత్వానీ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సేకరించిన ఆధారాలతోనే సీఐడీ ఆంజనేయులును అరెస్ట్ చేసిందని, ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని హోంమంత్రి స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వంలో అధికారులపై కక్ష సాధింపు లేదు
గతంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఎదుర్కొన్న ఇబ్బందుల విషయాన్ని ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఏ అధికారికి రాలేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఏ అధికారిపైనా కక్ష సాధించలేదని తెలిపారు.
వైసీపీ introspection చేసుకోవాలి
వైసీపీ హయాంలో ఎందరో అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేశారని, ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిణామాలపై వైసీపీ introspection చేయాల్సిన అవసరం ఉందని అనిత హితవు పలికారు. గతంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు , ప్రజావేదిక కూల్చివేత , కార్యాలయంపై దాడి , పత్రికా ప్రతినిధుల వేధింపు , సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు , ఇలా ఎన్నో ఘటనలను ఆమె గుర్తు చేశారు.
చట్టానికి ఎవరూ మినహాయించు కాదు
ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ఎక్కడైనా శవం కనిపిస్తే జగన్ రోడ్లపైకి వస్తారని అనిత విమర్శించారు. తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు కట్టుబడి ఉందని , చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు పునర్విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఆధారాల ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకుంటామని, విచారణకు అందరూ సహకరించాలని ఆమె కోరారు.