Anirudh: కోలీవుడ్ సంగీత సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ‘మ్యాజిక్’ సినిమా ఆలస్యమవుతోంది. షూటింగ్ పూర్తయినా సంగీతం కారణంగా వాయిదా పడుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది.
Also Read: NTR: సన్నగా మారిన ఎన్టీఆర్.. టెన్షన్లో అభిమానులు!
అనిరుధ్ రవిచందర్ పేరు వింటేనే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. తెలుగులోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోలు ఆయనతో సంగీతం చేయించుకోవాలని ఆసక్తి చూపుతారు. అయితే ‘మ్యాజిక్’ అనే న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా ఏడాదిగా వాయిదా పడుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ గతేడాది పూర్తయింది. కానీ అనిరుధ్ ఇతర ప్రాజెక్టుల ఒత్తిడి కారణంగా సంగీతం పూర్తి చేయలేకపోయాడు. దీంతో సినిమా ఆలస్యమవుతోంది. ఇప్పుడు నిర్మాతలు వీలైనంత త్వరగా పూర్తి చేసి 2026 ప్రథమార్ధంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాష్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈసారైనా అనుకున్న డేట్‌కు వస్తుందో లేదో చూడాలి.

